Wednesday, 4 November 2026

ఆటలతో పాటు విద్య చాలా అవసరం

 

 

 

 

ఇంద్రవెల్లి జనవరి 26 (జనం సాక్షి)ఇంద్రవెల్లి: మనిషి మనుగాడుకు విద్య చాలా అవసరమన్ని ఉట్నూర్ సీఐ సైదారవ్ అన్నారు.గురువారం డొంగర్ గవ్ లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్, కబడ్డీ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉట్నూర్ సీఐ సైదారవ్ మాట్లాడుతూ ఆటలతోపాటు చదువు చాలా అవసరం అన్నారు . యువకులకు ఉద్దేశించి దిశా నిర్దేశం చేశారు . చూడు వ్యాసాలకు, ఆ సాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు . సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చక్కగా కష్టపడి చదువుకోని మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. యువకులకు ప్రశ్నలు అడిగి సామర్థ్యం తెలుసుకున్నారు.అనంతరం ఆటాల కిట్లను పంపిణీ చేశారు. సర్పంచ్, వార్డ్ మెంబర్లు గ్రామస్తులు కలిసి సిఐ సైదారవ్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ రాంచందర్ ఉపా సర్పంచ్ మడవి శేష్ణరయన్,పంచాయతీ కార్యదర్శి జాదవ్ రితేష్, వార్డు మెంబర్లు పుర్క భీమ్ రావ్,జాదవ్ ప్రకాశ్ పెందుర్ బండు (,దేవరి) కోవ భీమ్ రవ్( గ్రామ పెద్ద) ఉపాధ్యాయుడు,మడవి దేవ్ రవ్,గ్రామస్థులు ,యువకులు తదితరులు పాల్గొన్నారు.