Monday, 16 November 2026

ఆటో-లారీ ఢీ. ఐదుగురు మృతి

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేపు మండలం చొల్లంగి వద్ద జాతీయరహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. యానం నుంచి కాకినాడ వెళ్తున్న టిప్పర్‌. చొల్లంగి  నుంచి కొత్తూరు వెళ్తున్న ఆటోనే ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగ గాయపడిన మరో ఐదుగురిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆటోలో మొత్తం పది మంది ప్రయాణిస్తున్నారు. మత్స్యకారులైన వీరు చొల్లంగిలో చేపలు కొని కొత్తూరుకు తీసుకువెళ్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *