సూర్యాపేట ప్రతినిధి,ఫిబ్రవరి 12 (జనంసాక్షి):ఆడపిల్లల చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంకు సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థ వ్యవస్థాపకులు చంచల్ గూడ సెంట్రల్ జైల్ ఎస్పీ నవాబ్ శివకుమార్ గౌడ్ గ్రూప్ -4 స్టడీ మెటీరియల్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో తమ వంతు సహాయంగా మెటీరియల్ ను అందజేసిన సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.అనంతరం సంస్థ సభ్యులు చంచల్ గూడ సెంట్రల్ జైలు సీనియర్ అసిస్టెంట్ మంచాల గోపికృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా పేద బాలికలకు ఆర్థిక సహాయాన్ని , స్టడీ మెటీరియల్ అందజేసినట్లు తెలిపారు.మెటీరియల్ కావాల్సిన వారు గ్రంథాలయ సెక్రెటరీని కలిసి తమ పూర్తి వివరాలను తెలపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో లైబ్రరీయన్ శ్యాంసుందర్ రెడ్డి,కౌన్సిలర్ నిమ్మల స్రవంతి శ్రీనివాస్ గౌడ్, వ్యక్తిత్వ వికాస నిపుణులు పూర్ణ శశికాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




