టేకులపల్లి, ఫిబ్రవరి 12( జనం సాక్షి ): మండల పరిధిలోని కొప్పురాయి గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ స్వర్ణ లింగేశ్వర మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం ఈనెల 18న స్వామి వారి కళ్యాణం ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గోడ పత్రిక ను ఎంపీపీ భూక్య రాధా సైదులు చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొప్పురాయి, మోదుగులగూడెం, ఒడ్డుగూడెం, రాజారాం తండా గ్రామాల గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరూ మల్లన్న స్వామి కళ్యణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.




