Monday, 2 November 2026

ఆడబిడ్డలకు అండగా బీఅర్ఎస్

చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ ఘనత మనదే

బిఅరెస్ మహిళ నేత సింగిరెడ్డి వాసంతి

వనపర్తి బ్యూరో అక్టోబర్13( జనంసాక్షి)

ఆడబిడ్డలకు అండగా బీఅర్ఎస్ పార్టీ ఉందని,
చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ ఘనత మనదేనని మంత్రి సతీమణి బిఅరెస్ మహిళా నేత సింగిరెడ్డి వాసంతి అన్నారు.
పెద్దమందడి మండలం దొడగుంటపల్లి, మంగంపల్లి నుండి 25 మంది, వనపర్తి జిల్లా కేంద్రంలోని మహిళా టైలర్లు 100 మంది భారీ ఎత్తున బీఅర్ఎస్ లో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి బీఆర్ఎస్ మహిళా నేత సింగిరెడ్డి వాసంతమ్మ ఆహ్వానించారు. మహిళలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ
మార్కెట్ యార్డుల పదవుల్లో రిజర్వేషన్ ఘనత బీఅర్ఎస్ పార్టీదేనని,ఆడబిడ్డల పెళ్లయితే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్,
గర్భవతులకు అమ్మవడి, న్యూట్రిషన్ కిట్
బిడ్డ పుడితే కేసీఅర్ కిట్, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డకు రూ.12 వేలు
కిషోర బాలికలకు సన్నబియ్యం, పాఠశాల విద్యార్థినులకు హెల్త్ కిట్లు లను ఇస్తూ
మహిళలకు పెద్దపీట వేస్తున్నాది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అని అన్నారు.
పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని,
జరుగుతున్న అభివృద్దికి తోడుగా నిలవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.