డయాబెటిక్ కారణంగా స్పృహకోల్పోయానని వెల్లడి
సకాలంలో ఆస్పత్రిలో చేర్చడం వల్ల బతికా: రాజసింహా
హైదరాబాద్,మే18(జనం సాక్షి ): తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా వ చ్చిన పుకార్లను దర్శకుడిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్న రాజసింహా ఖండించారు. ముంబైలోని తన రూంలో ఆత్మహత్యాయత్నంకి పాల్పడ్డాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అవకాశాలు లేకపోవడం వలన రాజసింహా తన రూంలో అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. అయితే ఈ వార్తలపై రాజసింహా వీడియో ద్వారా స్పందించారు. డయోబెటిక్ పేషెంట్ అయిన తాను, షుగర్ లెవల్స్ అధిక మోతాదులో పడిపోవడం వలన స్పృహ తప్పి పడిపోయాడని అన్నాడు. సవిూపంలో ఎవరు లేకపోవడం వలన సీరియస్ అయిందని, సమయానికి ఆస్పత్రికి చేర్చడంతో ప్రాణాపాయం తప్పిందని అన్నాడు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుపగా, రెండు రోజులలో హైదరాబాద్‌కి వచ్చి మిగతా విషయాలు మాట్లాడుతానని అన్నాడు. 2016లో సందీప్ కిషన్, నిత్యా విూనన్ ప్రధానపాత్రలలో ఒక్క అమ్మాయి తప్ప అనే చిత్రాన్ని తెరకెక్కించాడు రాజసింహా. ఆ తర్వాత శంకర్‌దాదా ఎంబీబీయస్, బొమ?మరిల్లు, ఝుమ్మంది నాదం, అనగనగా ఓ ధీరుడు, రుద్రమదేవి సినిమాలకు రచయితగా పనిచేశారు. నటుడిగా సంబరం , స్నేహం, టక్కరి దొంగ వంటి చిత్రాలలో కనిపించారు. ‘రుద్రమదేవి’ చిత్రంలో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్రకు సంభాషణలు రాసి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆత్మహత్య చేసుకోలేదన్న రాజసింహ




