– రెండో హరిత విప్లవానికి తెలంగాణ కేంద్ర బిందువు
– రైతుబంధుతో 98శాతం చిన్న, సన్నకారు రైతులకే మేలు
– కావాలనే ప్రతిపక్షాల ఆరోపణలు
– మంచి తనంతో చేసే పనిలో రంధ్రాన్వేషణ సమంజసం కాదు
– వలసలు వెళ్లిన వారు గ్రామాల బాటపడుతున్నారు
– విూడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మే18(జనం సాక్షి ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమవుతుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రెండో హరిత విప్లవానికి తెలంగాణ కేంద్ర బిందువు అవుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో విూడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో మంత్రి పలు విషయాలపై మాట్లాడారు.. రైతుబంధు పథకం అద్భుతంగా ఉందని.. రైతు రణమాఫీ కంటే ఎక్కువ స్పందన వస్తుందని మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మే 16, 2009 నాటి నుంచి తన పదేళ్ల ప్రజాప్రతినిధి అనుభవంలో అత్యంత సంతృప్తి నిచ్చిన కార్యక్రమం రైతుబంధుగా అభివర్ణించారు. బయట విమర్శలు చేస్తున్నా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. కావాలని కొందరు ప్రతిపక్ష నాయకులు చెడగొట్టాలని చూస్తున్నార విమర్శించారు. రైతుబంధు పథకం ద్వారా 98శాతం చిన్న సన్నకారు రైతులే లబ్ది పొందుతున్నారని వారు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. 1.3 శాతం మాత్రమే పెద్ద ఎత్తున భూమి ఉన్న వారికి లాభం జరుగుతుందన్నారు. లాండ్ సీలింగ్ ప్రకారం 54 ఎకరాలపైన భూమి ఉండటానికి వీలు లేదన్నారు. పిల్లలు, భార్య, వ్యక్తుల పేర్ల విూద ఉన్న వారికే పెట్టుబడి చెక్కులు ఇస్తున్నట్లు చెప్పారు. కంపెనీల పేరు విూద భూమి ఉంటే ఇవ్వటంలేదన్నారు. పెద్ద రైతు, చిన్న రైతు అంటున్న కాంగ్రెస్.. పెద్ద రైతు ఎవరు చిన్న రైతు ఎవరో లెక్కలు చెప్పాలన్నారు. రూ. 2 లక్షల పైన ఋణం ఉన్న రైతులెందరో ఉత్తమ్ చెప్పాలన్నారు. 10ఎకరాలపైన వారికి ఇవ్వకుంటే వారికెందుకు ఇవ్వరు వాళ్లు రైతులు కాదా అని సదరు నాయకులే అడిగేవారన్నారు. ఢిల్లీలో రూపాయి విడుదల చేస్తే చివరకు 20 పైసలే చేరుతున్నాయని నాటి ప్రధాని రాజీవ్ గాంధీనే అన్నారని.. కానీ వారంరోజుల్లోనే రూ. 5 వేల కోట్లు నేరుగా రైతులకే ఎలాంటి ఇబ్బంది లేకుండా అందించినట్లు చెప్పారు. రైతు బంధు పథకం బ్రహ్మాండంగా విజయవంతం అయ్యిందంటే అది సీఎం కేసీఆర్ వలనే సాధ్యమైందన్నారు. పెట్టుబడికే పెడుతారు అన్న నమ్మకం ఏందని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారని.. రైతు దేనికోసం ఖర్చు చేసుకుంటే విూకేందుకన్నారు. మంచి తనంతో చేసే పనిలో రంధ్రాన్వేషణ చేయటం సమంజసం కాదని హితవు పలికారు. తాము రైతులకు చేస్తున్న పెట్టుబడి సాయం ఒక్క విజయ్ మాల్య ఎత్తుకెళ్లినంత సొమ్ముకాదన్నారు. మంచి పథకాన్ని అభినందిచాల్సింది పోయి విమర్శించేందుకు సిగ్గుండాలన్నారు.
అటు కౌలు రైతులు అన్నది తెలంగాణలో వర్తించదని.. చట్టం ఉంది కానీ 12ఏళ్లు భూమి చేస్తే అతనికే భూమి పోతుందన్నారు. కౌలురైతుకు చెక్కు ఇస్తే ప్రభుత్వమే గుర్తించిందని లక్షల కేసులు పడుతాయన్నారు. డబ్బులు యజమానులకే వెళుతున్నందున కౌలు తగ్గించుకుంటాం అని రైతులు ముందుకొస్తున్నట్లు చెప్పారు. ఆవిధంగా కౌలు రైతులకు మేలు జరుగుతుందన్నారు. వందకు వంద శాతం రైతుబంధు పథకం రెండో హరిత విప్లవమన్నారు. రెండో హరిత విప్లవానికి తెలంగాణ కేంద్ర బిందువు అవుతుందన్నారు. రైతు బాగుంటే గ్రావిూణ వాతావరణం కులవృత్తులు నేత, గీత, కమ్మరి, కుమ్మరి
బాగుంటారన్నారు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి ఐదు రెట్లు పెరిగిందని చెప్పారు. అన్నపూర్ణ ఆంధ్ర కాదు .. తెలంగాణగా మారనుందన్నారు. రిటర్న్ మైగ్రేషన్ ప్రారంభమైందని.. దుబాయ్, బొంబాయి వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని చెప్పారు. నీటి సమస్య అధిగమించేలా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలోనే 38 వేల కోట్లు ప్రాజెక్టులకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ఇప్పటికే 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరింత ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎరువులు, విత్తనాల సమస్య లేదన్నారు. గోదాముల సమస్య పరిష్కారం అయిందన్నారు. ఇక మిగిలిన మద్ధతు ధరకోసం రైతు సమన్వయ సమస్యల ద్వారా పరిష్కారం చూపుతామన్నారు. అటు రైతు భీమా లోపభూయిష్టంగా ఉందని.. నష్టం జరిగిన 5 రోజుల్లో నష్టపరిహారం వచ్చేల చూడాలని మంత్రి కేటీఆర్ కోరారు. వ్యవసాయ రంగానికి అనుసంధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ డ్రాఫ్ట్ రెడీ గా ఉందన్నారు. సీఎం కేసీఆర్ త్వరలోనే హరిత విప్లవం, నీలి విప్లవం(చేపల పెంపకం), పింక్ రెవెల్యూషన్(విూట్ ప్రాసెసింగ్) క్షీర విప్లవం నాలుగింటిపై సమగ్ర ఆలోచన చేస్తారని తెలిపారు.
రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం




