Wednesday, 4 November 2026

ఆత్మీయ మిత్రుడు, జర్నలిస్ట్ రాజు మృతి బాధాకరం వైరా ఎమ్మెల్యే లావిడియా రాములు నాయక్

 

జూలూరుపాడు, జనవరి 23, జనంసాక్షి:
మండల పరిధిలోని గుండెపుడి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కాల్లూరి యతిరాజ్ కుమార్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఈయన గత 30 ఏళ్లకు పైగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పనిచేస్తూ జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు. రాజు ఆకస్మికంగా మృతి చెందిన వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు గుండెపుడిలోని స్వగృహంలో ఆయన భౌతిక భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావిడియా రాములు నాయక్ జర్నలిస్టు రాజు భౌతికకాయంపై పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప, సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి మనిషి, ఆత్మీయ జర్నలిస్టును కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. అనంతరం గుండెపుడి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గ్రామపంచాయతీ గుమస్తా సిరోజు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటానని మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు నరసింహారావు, ఎంపీపీ లావిడియో సోనీ, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, సొసైటీ డైరెక్టర్ కళ్యాణపు నరేష్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ యదళ్ళపల్లి వీరభద్రం, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నెకంటి సతీష్ కుమార్, జిల్లా నాయకులు కొమ్మినేని పాండురంగారావు, లకావత్ గిరిబాబు, వేల్పుల నరసింహారావు, మండల మాజీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, మోదుగు రామకృష్ణ, గుగులోతు చంటి పలువు నాయకులు పాల్గొన్నారు.