మెట్పల్లి టౌన్, జనవరి23,
(జనంసాక్షి): ఉపాధ్యాయుల అన్ని క్యాడర్ల ప్రమోషన్ లో భాగంగా భాషా పండితులకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్ యు పి పి టీ ఎస్) జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఎనగందుల రాజేంద్రప్రసాద్ మెట్పల్లి పట్టణంలో పేర్కొన్నారు.భాషా పండితులు ఎస్జీటీలతో సమానమని పేర్కొంటూ, స్కూల్ అసిస్టెంట్ హోదాలో పనిని చేయించడం శ్రమ దోపిడీ అవుతుందని అన్నారు. పండితులను అప్ గ్రేడ్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వెంటనే అమలు చేయాలని కోరారు. పండితుల ప్రమోషన్లను అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు పండిత సంఘాల జెఏసి పక్షాన జగిత్యాల జిల్లా కలెక్టర్ కు,మరియు జిల్లా విద్యా శాఖధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించ బోయే ఉపాద్యాయ పదోన్నతులతో పాటు భాష పండితులకు పదోన్నతి లు కల్పించాలని పండిత ఉమ్మడి ఐక్య వేదిక తమ ద్వారా ప్రభుత్వం ను కోరుతున్నామని, ప్రభుత్వానికి 1)గౌరవ హైకోర్టు తది తీర్పు కీ లోబడి భాష పండితులకు పదోన్నతి లు కల్పించాలని 2)త్వరలో విడుదల కాబోయే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూళ్లలో నే భాష పండితులకు కూడ పదోన్నతులు కల్పించి భాష పండితుల కుటుంబా ల్లో ఆనందం నింపాలని. విజ్ఞప్తి చేస్తున్నాము అని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్
టిఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఏనుగందుల రాజేంద్ర ప్రసాద్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లకట్టు సత్యనారాయణ ,
ఆర్ యూపిపి తెలంగాణ జగిత్యాల జిల్లా అధ్యక్షులు దండే రాజేంధర్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి ,ఎస్, ఎల్, టీ. ఏ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రంగ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తులసి శ్రీనివాస్,నరేందర్, భార్తల రాజాసాగ్ ,తెలుగు, హిందీ, ఉర్దూ ఉపాధ్యాయులు పాల్గొన్నారు
భాషా పండితులకు పదోన్నతు లు కలిపించాలి




