జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో ఐకెపి సెంటర్ ని సోమవారం రామగిరి మండల బిజెపి నాయకులు సందర్శించారు. అకాల వర్షాల వల్ల వరిధాన్యమంతా తడిసి పూర్తిగా ముద్దగా వరి ధాన్యం అంతా వర్షంలో మునిగి కొట్టుకపోతుండగా నీళ్లలో ఉన్న ధాన్యాన్ని రైతు ప్రభుత్వం అని చెప్పే టీఆర్ఎస్ పార్టీ అకాల వర్షాల వల్ల నష్టపోతుంటే కూడా పట్టించుకునే నాయకులే లేరు అని వారు ఆవేదన చెందారు. రైతుల గోడు పట్టించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి నాయకులు ములుమూరి శ్రీనివాస్ అన్నారు. ఐకెపి సెంటర్ లో ఉన్న ధాన్యాన్ని కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే జాయింట్ కలెక్టర్ కి ఫోన్ చేయగా రెండు రోజులలో మొత్తం కొంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తడిసిన ధాన్యం వద్దని అంటున్నారని వారి దృష్టికి తీసుకుపోగా మిల్లర్లు ఐకెపి సెంటర్లను ఆదేశిస్తామని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులకు అన్యాయం జరుగుతే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉండదని రైతుల అందరితో కలిసి కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడి చేస్తామని బిజెపి నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు డాన్సులు చేయడం తప్ప రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత 20 రోజులుగా ఐకెపి సెంటర్లలో వడ్లు పోసి రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకునే నాయకులే లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఐటీ సోషల్ మీడియా జాయింట్ కన్వినర్ తొట్ల రాజు, మండల నాయకులు కుంట చక్రి,తీగల శ్రీధర్, యాట బుమేష్, ఉదరి ప్రశాంత్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.




