జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల కార్యాలయంలో మేడే సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి జెండా ఆవిష్కరించి కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యమత్యంతో పోరాడితే ఎన్నో సంక్షేమ పథకాలు వస్తాయని కార్మికుల పోరాట ఫలితమే మేడే అని కార్మికుల కష్టానికి ఫలితం దక్కిన రోజు మేడే అలాంటి మేడే ఉత్సవాలు ను జరుపుకోవడం ఎంత ఆనందంగా ఉందన్నారు. తద్వారా చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎస్కే షరీఫ్, బైరి శంకర్ ,కోయాడ సంపత్, సమ్మయ్య, వెంగళ రాములు, గాదె సారయ్య, భూమయ్య, విష్ణువర్ధన్, బనుకు సంతోష్, తదితర కార్మికులు పాల్గొన్నారు.




