ఆత్మ నగర్ గ్రామములో సర్పంచ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారుల సమీక్ష సమావేశం*
మెట్ పల్లి, డిసెంబర్ 24,
జనంసాక్షి :
మెట్ పల్లి మండలం ఆత్మనగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జగిత్యాల, మెట్ పల్లి ఎక్సైజ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొని సమీక్షా సమావేశం జరిగింది. కరోనా లాక్డౌన్ నుండి జిల్లా లోని చాలా ప్రాంతాల్లో మొదలైన గుడుంబా, గంజాయి పూర్తిగా నిర్ములన కై సహాకారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మంచి పౌరులుగా బాధ్యతతో అటువంటి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గొప్యంగా ఉంచుతామన్నారు..ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ శ్రీనివాస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు సమ్మయ్య,రవి రెడ్డి,మజీద్ ,కార్యదర్శి నిజాముద్దీన్,ఎక్సైజ్ సిబ్బంది, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆత్మ నగర్ గ్రామములో సర్పంచ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారుల సమీక్ష సమావేశం




