Sunday, 8 November 2026

సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎస్.మహిపాల్

సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎస్.మహిపాల్
జహీరాబాద్ డిసెంబర్ 24( జనంసాక్షి)సిద్దిపేటలో ఈ నెల 21నుండి 23 వరకు జరిగిన సిఐటియు రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎస్.మహిపాల్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాసభల్లో కార్మికుల సమస్యలపై అనేక తీర్మానాలు చేయడంతో పాటు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం జరిగింది అన్నారు. రాష్ట్ర నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అన్నారు ఈ కమిటీలో ఎస్.మహిపాల్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది. కార్మికుల సమస్యలపై, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు ఉధృతం చేయాలని మహాసభ నిర్ణయించడం జరిగింది అన్నారు.