చర్చి వద్ద పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
మెట్ పల్లి టౌన్, డిసెంబర్ 24,
జనంసాక్షి :
శనివారం రోజున మున్సిపల్ కమిషనర్ రాజ్ కుమార్ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని చర్చి లోపల బయట పరిసర ప్రదేశాలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు కమిషనర్ మాట్లాడుతూ చర్చి ప్రదేశాలలో చెత్తాచెదరం లేకుండా క్లీన్ చేయించాలని చర్చికి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం అయ్యప్ప మండల పడి పూజ ఉన్నందున దాని పరిసరాలలో పరిశుభ్రంగా, ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, ధర్మేందర్ ,నరసయ్య నిజాం తదితరులు పాల్గొన్నారు
చర్చి వద్ద పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్




