Thursday, 5 November 2026

18న నాగోబా విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమం

18న నాగోబా విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమం.

జనం సాక్షి ఉట్నూర్.

ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని కేస్లాపూర్ గ్రామంలో మెస్రం వంశస్తుల ఆరాధ్య దైవం నాగోబా విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నరు ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జై వంత్ రావు నీ కలిసి ఆహ్వాన పత్రం అందించారు. అనంతరం నాగోబా పీఠాధిపతి మెస్రం వెంకట్రావు పటేల్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన నాగోబా ఆలయనీ డిసెంబర్ 18న శేకు నాగోబా విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమం ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు కేస్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. విగ్రహం పున ప్రతిష్ట భాగంలో 12వ తేదీ నుండి 18 వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7:00 నుండి 9 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న పటేల్ శేఖర్ బాబు కౌసే రావు ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఆనందరావు తుకారాం టిపిసిసి సభ్యుడు కాంగ్రెస్ జిల్లా అదిలాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేడ్మ భోజ్జు పటేల్ మెస్రం వంశస్థులు తదితరులు ఉన్నారు.