బచ్చన్నపేట జనవరి 18 (జనం సాక్షి)ప్రజాకవి వేమన జయంతి సందర్భంగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో వేమన ఫౌండేషన్-అనంతపురం వారి ఆధ్వర్యంలో వేమన పద్యాల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో విద్యార్థులకు ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులుగా పతకాలతో పాటు వేమన శతకం పుస్తకాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు శ్రీమతి కర్ల కృష్ణవేణి గారు,తెలుగు అధ్యాపకులు శ్రీ స్వర్గం నర్సింహులు గారు,శ్రీ మీసాల సుధాకర్ గారు,శ్రీమతి పర్వీన్ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.ఈ కార్యక్రమ నిర్వహణకు పూర్తి సహకారం అందించిన వేమన ఫౌండేషన్ అనంతపురం వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఆదర్శ పాఠశాలలో వేమన పద్యాల పోటీలు




