మెట్ పల్లి టౌన్ జనవరి 19,
జనంసాక్షి:
మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ఎస్సారెస్పీ రామాలయ ఫంక్షన్ హాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కంటికి వెలుగు రెండవ విడత కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగిందని దీనిని పట్టణ గ్రామీణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఎవరికైనా మందుల అవసరమున్న చొ మందులు ఇవ్వడం జరుగుతది,
అద్దాలు ఎవరికి అవసరమో అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ,
అలాగే ఆపరేషన్ ఉన్న వారికి కూడా ఆపరేషన్ ఉచితంగా చేయడము జరుగుతుందని దీనిని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ పథకం నిరుపేదలకు అందుబాటులో ఉండేందుకు ప్రతి వార్డులో ఒక సెంటర్ వేయడం జరుగుతుందని అక్కడికి వద్దకు కంటి డాక్టర్లు ఏఎన్ఎం లో ఆర్పీలు ఉండి ప్రజలకు సహకరించవలసిందిగా కోరారు ,
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్ ,మున్సిపల్ చైర్మన్ రానావేని సుజాత సత్యనారాయణ ,వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు ,డాక్టర్ కౌన్సిలర్, కోఆప్షన్స్, ఏఎన్ఎంలో, ఆర్పీలు, మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు .
కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు




