Thursday, 5 November 2026

కంటి వెలుగు కార్యక్రమంను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి

 – మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనరవి
హుజూర్ నగర్ జనవరి 19 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి అన్నారు. గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని 14వ వార్డులో యుపిఎస్ స్కూల్లో కంటి వెలుగు కార్యక్రమమును స్థానిక కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి వెంకటేష్, చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ కోట నరసింహారావు లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనరవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అన్ని రకాల కంటి పరీక్షలు, కళ్లద్దాలు ఉచితంగా అంద చేయబడతాయన్నారు. 14వ వార్డు పరిధిలోని ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కోలపూడి యోహాన్, బి ఎల్ ఓ ఇట్టిమల్ల రేణుక, ఆశ వాలంటరీ కోలపూడి హేమలత, ఇందిరాల వీరమ్మ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.