Tuesday, 3 November 2026

ఆదర్శ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరిస్తూ మెరుగైన విద్యా ప్రమాణాలు, సౌకర్య వసతులను కల్పించాలి

-జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్ బ్యూరో-జూలై ..(జనంసాక్షి)

ఆదర్శ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరిస్తూ మెరుగైన విద్యా ప్రమాణాలు, సౌకర్య వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. గురువారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులతో, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ లతో ఆదర్శ పాఠశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారం, మెరుగైన విద్యా ప్రమాణాలు, సౌకర్య వసతులపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పదవ తరగతిలో మహబూబాబాద్ మోడల్ స్కూల్ విద్యార్థులు వంద శాతం ఫలితం సాధించడం జరిగిందని, ఆదర్శ పాఠశాలల్లో మెరుగైన సౌకర్య వసతులు కల్పించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, స్కూల్, హాస్టల్ లలో ప్రహరీ గోడలు లేని వాటిపై ప్రతిపాదనలు సమర్పించాలని, వాష్ రూం లు ఏర్పాటు,  టాయిలెట్ లు బాలురు, బాలికలకు విడి విడిగా ఉండాలని, మిషన్ భగీరథ నీరు సంప్ నుండి డైనింగ్ హాల్ వరకు, భోజన అవసరాలకు ఉపయోగించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని, చిలుకోడు, కల్వలలో వారం రోజుల పాటు మిషన్ భగీరథ నీరు ఎంత మేరకు వస్తుంది పరిశీలించి స్త్రెంత్ కు అనుగుణంగా కాకుండా తక్కువగా వస్తున్నట్లైతే తెలపాలని సూచించారు. బొర్వెల్ తప్పనిసరిగా ఉండాలని, ఉన్న బోర్వెల్ లో నీరు రానీ సందర్భంలో మరొక చోట వేసుకొని నీటి సమస్య రాకుండా చూడాలని తెలిపారు. విద్యుత్ మీటర్ ఉన్నదా అని, విద్యుత్ సమస్య లేకుండా చూడాలని, కిచెన్ షెడ్ ల నిర్మాణం ఎన్.ఆర్. ఈ.జి.ఎస్. ద్వారా చేపట్టే విధంగా చూడాలని, తెలిపారు. హాస్టల్ లలో మెస్ జాలీలు లేని చోట ఏర్పాటు చేయాలని, సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కిటికీలు, తలుపులను అవసరం మేరకు మరమ్మతులు చేయాలని తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు డి. ఈ. ఓ. మాట్లాడుతూ, జిల్లాలో (8) మోడల్ స్కూల్స్ నర్సింహులపేట, నెళ్ళికుదురు, నేరేడ, మహబూబాబాద్, కల్వల, చిలుకోడు, మరిపెడ, గుర్తూరు లో ఉన్నాయని, అందులో ఆరవ తరగతి నుండి, ఇంటర్ వరకు విద్యను అందిస్తున్నామని, 4770 మంది విద్యార్థులు ఉన్నారని, ఆరవ, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి ఎం.డి. అబ్దుల్ హై, ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ డి.ఈ. అరుణ్ కుమార్, టి.ఎస్. ఈ. డబ్ల్యూ. ఐ.డి.సి. – ఈ. ఈ., డి.ఈ., మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లు, తదితరులు పాల్గొన్నారు.