Friday, 6 November 2026

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (28): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ను గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు శివన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షుడు శివన్న పార్టీ జెండా ను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ అని భారత దేశ స్వాతంత్రం తేవడంలో కీలక పాత్ర పోషించిందని,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిందన్నారు. రాబోయే కాలంలో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలన్నారు.ఈకార్యక్రమలో
జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కోంకి వెంకటేష్ ,మాజీ ఎంపీటీసీ బాలయ్య, మండల జనరల్ సెక్రెటరీ సుధాకర్ రావు ,బ్యాగరి శాంతయ్య, హోటల్ శ్రీనివాసులు,యూత్ ప్రెసిడెంటు బాలపిరు, వార్డు మెంబర్ వెంకటయ్య, బాలకృష్ణ నాయుడు, పూసల లక్ష్మణ్,
టైలర్ కిషోర్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు , తదితరులుపాల్గొన్నారు.