ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు పటేల్.
ఎంపీపీ పంద్రా జైవంత్ రావు.
జనం సాక్షి ఉట్నూర్.
ఉట్నూర్ మండల కేంద్రంలోని నర్సాపూర్ జే (దమన్ పెట్) గ్రామంలో డేమెల రాజుల పరిరక్షణ కమిటి ఏర్పాటు చేయడం కొరకు గ్రామ పటేల్ ఆత్రం కిషన్ రావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు పటేల్,ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవాంత్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడతు ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనీ డెమ్మల రాజుల్ కి రోడ్డు సౌకర్యం ఏర్పాటు కు మనమందరం కృషి చేసి, త్రాగు నీరు పై దృష్టి సారించాలని అన్నారు.అందుకు మనమందరం కలిసి సేసా, సరతో అనగా ప్రతి గ్రామంలో చంద వసూలు చేసి అభివృద్ధి కి కృషి చేద్దాం అన్నారు.
అనంతరం కమిటీని ఏర్పాటు చేశారు.ఛైర్మన్ గా ఆత్రం కిషన్ రావు,వైస్ చైర్మన్ గా ఆత్రం శక్సన్ రావు కార్యదర్శిగా కుమ్రా శంకర్ కోశాధికారి గా గెడం జుగదిరావు సలహా దారులుగా సభ్యులను ఎన్నుకున్నారు.అనంతరం టీపీసీసీ ప్రధాకార్యదర్శి ఎన్నికైన సందర్భంగా వెడ్మ బోజ్జు పటేల్ ను ఉట్నూర్ ఎంపిపి పంద్రా జైవాంత్రావ్,సర్మెడిలు,పటెల్లు, ఎంపిటిసి,సర్పంచులు షల్వ తో సన్మానించి శుభాకాక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం స్థానిక పుర్పంచ్ ఆత్రం విశ్వనాథ్,మతాడి గూడ సర్మేడి పెందోర్ చిత్రు, కుంర మోహన్, మత్తడి గూడ సర్పంచ్ మాడవి మోతీరం, నగల్కొండ సర్పంచ్ కుంర రాహుల్,బీర్సాయిపెట్ ఎంపీటీసీ ఆత్రం లచ్చు పటేల్,మంగం మారుతి టీచర్, ఆత్రం శ్రీరామ్ మిద్దెచింత పటేల్,తదితరులు ఉన్నారు.




