ఆదిశిల క్షేత్రాన్ని దర్శించుకున్న ప్రముఖ వ్యాపారవేత్త
మల్దకల్ డిసెంబర్ 24 జనంసాక్షి) మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శనివారము గద్వాల చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పెద్దపల్లి లక్ష్మీకాంత్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ మర్యాదలతో సోదరంగా స్వాగతం పలికారు.అనంతరం దేవాలయంలోని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి చరిత్రను వివరించారు.ఆలయ వ్యవస్థాపక వంశీయులు పట్వారి ప్రహ్లాద రావు దంపతులకు ఆలయ చరిత్ర పుస్తకాన్ని శేష వస్త్రంతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు పెద్దపల్లి సీతారాం రెడ్డి,చంద్రశేఖర రావు, మధుసూదన్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




