ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ఆశయం
– పోచారం సురేందర్ రెడ్డి…
ఫోటో :- రజక సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న దృశ్యం…
రుద్రూర్, డిసెంబర్ 24 (జనంసాక్షి ) : ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని బాన్సువాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రంలో 10లక్షల రూపాయలతో రజక సంఘం నూతన భవన నిర్మాణానికి పోచారం సురేందర్ రెడ్డి వైస్ ఎంపీపీతో కలిసి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సిద్దించక రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం అన్ని కుల సంఘాల అభివృద్ధికి ఎంతో చేయూత నిస్తుందని అన్నారు. తెలంగాణ ఫలాలు అందరికి అందుతున్నాయని, తద్వారా బంగారు తెలంగాణ వైపు రాష్ట్రం పరుగులు పెడుతుందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో , తెరాస మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, కార్యదర్శి నెరుగంటి బాలరాజు, గ్రామ అధ్యక్షులు తోట్ల గంగారాం, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాజీ సోసైటీ చైర్మెన్ పత్తి రాము, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామగౌడ్, వార్డ్ సభ్యులు స్వప్న భూషన్, రజక సంఘం మండల అధ్యక్షులు భూషన్, డౌర్ సాయిలు, నక్క సాయిలు, మండల సోషల్ మీడియ కన్వీనర్ లాల్ మొహమ్మద్, సయ్యద్ ముల్తానీ, కోడె శంకర్, షేక్ హాజీ,కాలీమ్ ఖురేషి,షేక్ జామిల్ ,ఇక్రామ్, రజక సంఘం సభ్యులు కే.సాయినాథ్, భీమ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




