దొంగతనాలు జరిగిన దుకాణ యజమానులను పరామర్శించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు*
మెట్ పల్లి టౌన్,డిసెంబర్ 24, జనంసాక్షి :
మెట్పల్లి పట్టణం లో మెయిన్ రోడ్ లో బుధవారం రాత్రి 10 దుకాణ సముదాయాలలో వరుస దొంగతనాలు జరిగిన సంఘటన తెలిసిందే.కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మెట్పల్లి పట్టణంలో వరుస దొంగతనాలు జరిగిన విషయంలో శనివారం రోజున దుకాణ సముదాయ యజమానులను పరామర్శించి ఓదార్చడం జరిగింది. దొంగతనాలకు పాల్పడిన వారిని తప్పనిసరిగా పట్టుకొని వారి వద్ద నుండి దొంగలించిన సామాన్లను, డబ్బులను రికవరీ చేసి యజమానులకు అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారుసాయిరెడ్డి, కో ఆప్షన్ నెంబర్ మార్గం గంగాధర్, పూదరి సుధాకర్, ఇబ్రహీంపట్నం మండల పార్టీ అధ్యక్షులు దశరథం రెడ్డి,జెడి సుమన్,సల్మాన్ బిఆర్ఎస్ నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




