ఆది వరహాస్వామి సన్నిధిలో భక్తులకు అన్నదానం

కమాన్ పూర్, జనంసాక్షి : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివారహస్వామి క్షేత్రంలో మూడు రోజులపాటు మండల కేంద్రానికి చెందిన మాదాసు రవీందర్ అన్నదానం నిర్వహించారు. స్వామివారి జయంతి ఉత్సవాల్లో భాగంగా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రస్తుతం జహీరాబాద్ లో ఉంటున్న మాదాసు రవీందర్ సుజాత దంపతులు ప్రతిరోజు సుమారు 1500 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత సంవత్సరం జయంతి ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు రవీందర్ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా కన్న గ్రామంలో శ్రీ ఆది వరహాస్వామి ఉండడం అదృష్టంగా భావించి స్వామివారి పై ఉన్న భక్తితో అన్నదానం నిర్వహించారు. మంగళవారంతో స్వామివారి జయంతి ఉత్సవాలు ముగియ ఉన్నాయి. ఈ వేడుకల్లో ఆది వరహాస్వామి ఆలయ చైర్మన్ ఇనగంటి ప్రేమలత జగన్నాథరావు ఇన్చార్జి ఈవో ధరినేని వెంకట మారుతీ రావు దేవాదాయ ఇన్స్పెక్టర్ సుజాత డైరెక్టర్లు దండే కనకరత్నం, భూ పెళ్లి జ్యోతి, బొజ్జ నరసింహ చారి సిబ్బంది కల్వల సంతు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.