Thursday, 5 November 2026

ఆదుకుంటామని ఆస్తి కాజేసిన “బిజెపి

” నేతలు..ఆదుకుంటామని ఆస్తి కాజేసిన “బిజెపి” నేతలు..
ఉల్టా కేసులు పెడతామని బెదిరింపులు.
బండి సంజయ్ గారు కాపాడాలంటూ మీడియా ముఖంగా మైనార్టీ వృద్ధురాలు వేడుకొలు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 21. (జనంసాక్షి). సమస్యల్లో ఉన్న వృద్ధురాలు న్యాయం చేయాలంటూ ఇద్దరు పెద్దలను వేడుకుంది. మేమున్నాం ఆదుకుంటాం అని భరోసా ఇచ్చిన ఇద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏకంగా ఆ వృద్ధురాలికి సంబంధించిన ఆస్తిని కాజేసేందుకు స్కెచ్ వేశారు. వృద్దు రాలు పేరుపై ఆస్తి ఉంటే బంధువులు కాజేస్తారని నమ్మబలికారు. ముందు ఆస్తిని మా పేరు పైకి బదిలాయిస్తే సమస్యలు తీరినాక మళ్ళీ ఆస్తి అప్పచెబుతామంటూ నమ్మబలికారు. అవకాశం కోసం ఎదురుచూసిన సదరు నాయకులు ఏకంగా ఆస్తిని విక్రయానికి పెట్టడంతో వృద్ధురాలు కన్నీటి పర్యంతరమవుతూ మంగళవారం సిరిసిల్లలో మీడియా ముందు తన ఆవేదన చెప్పుకుంది. బాధితురాలు శమీ సుల్తానా మంగళవారం తనకు జరిగిన అన్యాయాన్ని తెలుపుతూ సదరు నాయకులు బెదిరింపుల  నుండి కాపాడి తన ఆస్తిని తనకు ఇప్పించి ప్రాణభయం లేకుండా చూడాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని వేడుకుంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఠాకూర్ రాజాసింగ్, మేకల కమలాకర్ లకు  అస్తి విషయంలో తమ కుటుంబంలో ఉన్న వివాదాలను సదరు నాయకులకు మొరపెట్టుకుంది. నీకెందుకు మేమున్నాము పరిష్కరిస్తామంటూ తనతో నమ్మబలికారని తెలిపింది. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి లో ఉన్న ఇల్లు ఆరు గంటల జాగాను ఆస్తి కాపాడుతామంటూ ఠాకూర్ రాజాసింగ్ మేకల కమలాకర్ లు ఆస్తిని వారి పేర్లకు మార్చతే సమస్యలు తీరా తర్వాత మళ్లీ తన పేరుకు మార్చుతామని చెప్పడంతో పూర్తిగా నమ్మినట్లు వృద్ధురాలు తెలిపింది. తన సొంత ఖర్చులతో వారి పేర్లతో రిజిస్టర్ చేసినట్లు తెలిపింది. వీటితోపాటు సారంపల్లి టెక్స్ టైల్ పార్కులోని ఇంటికి సంబంధించిన పత్రాలను తీసుకొని వారికి అమ్మినట్లుగా బాండు పేపర్ పై రాసుకోవడమే కాకుండా తన ఆస్తి పత్రాలు కూడా వారి వద్ద ఉంచుకున్నట్లు వృద్ధురాలు తెలిపింది. సమస్యలు సద్దుమణిగిన తర్వాత తన ఆస్తి తన పైకి తన పేరుపై మార్చాలని కోరితే రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పంచాయతీ విషయంలో బిజెపి నాయకులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెబితే అడిగినప్పుడల్లా ఇచ్చానని తెలిపింది. ఈ విషయంలో పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడం జరిగిందని అప్పటినుండి తనను  రాజాసింగ్ కమలాకర్ లు  ఉల్టా కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ వారి నుండి కాపాడాలని స్థానిక నాయకులతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు కన్నీళ్లతో మొరపెట్టుకుంది. నాయకులనీ నమ్మితే వృద్ధురాలునైనా తనను నిండా ముంచారంటూ వాపోయింది.