ఆదుకున్న ప్రభుత్వానికి అండగా ఉండాలి

19 మందికి రూ.12 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూలై 12 (జనం సాక్షి)

ఆదుకున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం జడ్చర్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన 19 మందికి రూ.12 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో సీఎం సహాయనిధి మండలానికి ఒక్క చెక్కు కూడా వచ్చేది కాదని నేడు వేలాది మందికి లక్షలాది రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్నారు. చెక్కులు పొందిన వారు గ్రామాల్లోకి వెళ్లి చర్చించాలని ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు .

తాజావార్తలు