గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ
పెన్ పహాడ్ జులై 11(జనం సాక్షి ) : గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయితీ కార్మికులు మంగళవారం మండల పరిషత్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహంకు వినతి పత్రం అందజేశారు. జీపీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సీపీఎం మండల కార్యదర్శి రణపంగకృష్ణ, దోస పహాడ్ ఎంపీటీసీ గద్దల నాగరాజు సంఘీభావం తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ జీపీ కార్మికులకు పీఆర్సీతో పాటు కనీస వేతనం రూ. 19 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో జిపి కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీనివాస్ మండల అధ్యక్షులు రణపంగా వెంకన్న మండల ప్రధాన కార్యదర్శి నకరికంటి నరసయ్య సహాయ కార్యదర్శి దోస పాటీ విజయ్, గూడపూరి శ్రీనివాస్, సిలువేరు సైదులు ,గుగ్గిళ్ళ ఏడుకొండలు ,మాతంగి రవి ఒగ్గు మట్టయ్య ,ఒగ్గు నరేష్ ,రమేష్, లక్ష్మయ్య, సైదులు, సత్తమ్మ, ఎల్లమ్మ, రజిత, నీరజ, నాగరాజు జానయ్య తదితరులు పాల్గొన్నారు…