-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 8 (జనం సాక్షి);
జిల్లాలో ఆదార్ తీసుకొని 10 సంవత్సరాలు దాటిన వారు తప్పని సరిగా ఆదార్ అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.బుధవారం కల్లెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలు నందు మీసేవ సెంటర్ల ఆపరేటర్లు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని మండలాల్లో ఆదార్ సర్వీసు సేవా కార్యకలాపాల పై మాట్లాడుతూ 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అంగన్వాడి సెంటర్ల ద్వారా ఆదార్ నమోదు చేయాలనీ, 05-12 సంవత్సరాల వయస్సు గల వారిని విద్యాశాఖ ద్వారా నమోదు చేఇంచాలని, వైద్య శాఖ అప్పుడే పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఆదార్ నమోదు చేయాలనీ అన్నారు. మొదటి సారిగా ఆదార్ నమోదు చేసే వారికీ ఎలాంటి రుసుము తీసుకోరాదని ఆదార్ ఆపరేటర్లకు సూచించారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం దరల పట్టికను తెలుగులో డిస్ప్లే లో ఉంచాలని, ఆదార్ నమోదు కోసము బర్త్ సర్టిఫికేట్, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐ డి , బ్యాంకు పాస్ పుస్తకము ఏదైనా ఐ డి ప్రూఫ్ తో అప్డేట్ చేసుకోవాలని , మొబైల్ నెంబర్ తప్పని సరిగా ఉండాలని, ఆదార్ పై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉంటే జోగులాంబ గద్వాల్ జిల్లాగా మార్చుకోవాలని సూచించారు.విద్యా శాఖ అధ్వర్యంలో జరిగే ఆదార్ నమోదు కార్యక్రమ్మాన్ని త్వరగా పూర్తి చేఇంచాలని, మండలాల వారిగా లిస్టు తయారు చేసి మీకు ఇచ్చిన 9 ట్యాబుల ద్వారా ఆదార్ నమోదు వేగవంతం చేయాలనీ విద్యా శాఖ అధికారికి ఆదేశించారు.సమావేశం లో జిల్లా ఎస్ పి సృజన, జిల్లా అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్, ఆర్ డి ఓ రాములు ,ఆదార్ రిజినల్ అధికారి వినయ్ , శిశు సంక్షేమ అధికారి ముసాయిదా బేగం, డి ఇఓ సిరాజుద్దీన్, శ్వేత ప్రియదర్శిని, ఇ డి ఎం శివ , ఆదార్ నమోదు ఆపరేటర్లు ,
తదితరులు పాల్గొన్నారు.




