Thursday, 5 November 2026

ఆధ్యాత్మిక కేంద్రంగా పిల్లలమర్రి

ఆధ్యాత్మిక కేంద్రంగా పిల్లలమర్రి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): కాకతీయుల కాలం నాటి చారిత్రాత్మక దేవాలయాలు కలిగిన పిల్లలమర్రి జిల్లా కేంద్రంలో విలీనమై మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.మంగళవారం కార్తీక మాసం మాస శివరాత్రి పురస్కరించుకొని మహాదేవ నామేశ్వర స్వామి వారి దేవాలయం ఎదుట జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు, వసతులు మెరుగుపరచుకోవాలని దేవాలయ కమిటీకి సూచించారు.చిన్ననాటి నుండి శివరాత్రి వేడుకలకు,పిల్లలమర్రి దేవాలయాలకు వచ్చేవారమని గుర్తు చేసుకున్నారు.చారిత్రక సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.గ్రామ పురోహితులు పులి హరిప్రసాద శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ ఘట్టాలను భక్తులకు వివరిస్తూ కళ్యాణ తంతు నిర్వహించారు.భక్తులచే స్వామివార్లకు తలంబ్రాలు పోయించి కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు.భారీగా భక్తుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ , డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , దేవాలయ కమిటీ చైర్మన్ వల్లల సైదులు యాదవ్, కౌన్సిలర్లు వట్టే రేణుఖ, సిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ , జాటోత్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.