ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత.

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప.
అన్నం పరబ్రహ్మ స్వరూపం.
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.


తాండూరు నవంబర్ 8(జనంసాక్షి)ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయ స్వామి సన్నిధికి చేరుకుని నదిలో స్నానం
ఆచరించి ,ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు నందకుమార్ పూజారి వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి మరేన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని మనసారా ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు.కార్తీక పౌర్ణమి పురష్కరించుకొని ఆలయ ప్రాంగణంలో సుమారు1000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పురష్కరించు కొని అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమ న్నారు.ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకో వడం జరుగుతుందని వెల్లడించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ పూజారులు భక్తులు ఉన్నారు.