ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకోవాలి.
– నెన్నెల ఎస్సై రాజశేఖర్.
నెన్నెల, డిసెంబర్ 31, (జనంసాక్షి )
నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని నెన్నెల ఎస్సై రాజశేఖర్ పిలుపునిచ్చారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్థ రాత్రి తాగి బైకు నడపడం, బైకులపై త్రిబుల్ రైడింగ్ చేస్తూ, కేరింతలు కొడుతూ, బైకులను స్నేక్ డ్రైవింగ్ చేస్తూ, తోటి వారికీ ఇబ్బంది కలిగిస్తూ , అశాంతి వాతావరణం కలిగించాలని చూస్తే వారిని గుర్తించి, వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అర్థ రాత్రి 12 గంటల తరువాత రోడ్ల పై కేకులు కట్ చేసినా, డీజే లు పెట్టి డాన్సులు చేసినా, మద్యం సీసాలతో బహిరంగంగా తాగుతూ కనిపించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోబడుతాయాని హెచ్చరించారు. నూతన సంవత్సరం సందర్భంగ అతి ఉత్సాహం చూపిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తూ, ప్రభుత్వ ఆస్తులను కానీ, ప్రజల ఆస్తులని కానీ, ధ్వంసం చేస్తే వారిపై కేసులు మరియు నష్టపరిహారం పై కేసులు నమోదు చేయాల్సి వస్తుందన్నారు. నూతన సంత్సర శుభాకాంక్షలు చెప్పే క్రమములో అసభ్య సందేశాలు, అసభ్య ఫోటో లు పంపించినా, అసభ్య ఆడియోలు పంపిస్తే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ నూతన సంత్సర వేడుకలు ప్రశాంత వాతావరణములో జరుపుకొనుటకు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో పోలీసు లు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించబడు తుందన్నారు. మీమీ ఇళ్లలోనే వేడుక జరుపుకోవాలని, క్షణికా ఆవేశంలో తాత్కాలిగా ఆనందం కోసం చేసిన చర్యల వలన ప్రమాదము జరిగినా అది మీ కుటుంబం లో తీరని నష్టం జరిగి, భవిష్యత్తు నాశనం అవుతుందని వివరించారు.
మీ కుటుంబములో మీ పిల్లల కు మంచి భవిష్యత్తు కొసం మీ కుటుంబ అభివృద్ధి కి ఉపయోగపడేలా, కొత్త ఆలోచనలతో, మంచి నిర్ణయాలతో మీ ఇల్లు, మీ గ్రామము లలోని, పట్టణం లోని ప్రతి కుటుంబం ఈ నూతన సంత్సరములోనికి అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తూన్నామన్నారు.
ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకోవాలి




