నిబంధనలకు లోబడి వేడుకలు నిర్వహించుకోవాలి బోథ్ (జనంసాక్షి) నిబంధనలకు లోబడి వేడుకలు నిర్వహించుకోవాలిఅని బోథ్ సిఐ కిరణ్ కుమార్ సూచించారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్ని అత్యంత సంతోషంగా ఉల్లాసంగా నిర్వహించుకోవాలనే ఆకాంక్షలో ఇతరులకు ఇబ్బంది కలిగించడం కానీ అతిగా మద్యం సేవించి రోడ్లపై తిరగడం కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడం గాని పెద్ద పెద్ద శబ్దాలతో డీజే లను నిర్వహించడంపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వేడుకలు ఉల్లాసభరితంగానే ఉండాలి కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని ఎవరైనా వీటిని అధిక్రమిస్తే రాత్రి వేళలో 12 గంటల తర్వాత రోడ్లపై సంచరిస్తే చట్టరీత్యా చర్యలు చేపడతామని హెచ్చరించారు. యువత ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వేడుకలు నిర్వహించుకోవాలని నారు.
నిబంధనలకు లోబడి వేడుకలు నిర్వహించుకోవాలి




