Monday, 2 November 2026

బదిలీపై వెళ్లడం బాధాకరం వైద్యాధికారిణి అంబికా

బదిలీపై వెళ్లడం బాధాకరం
వైద్యాధికారిణి అంబికా
రేగోడ్ //జనం సాక్షి //డిసెంబర్ :
ఏళ్ల తరబడిగా రేగోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లడం బాధాకరమైన విషయమని వైద్యాధికారిని అంబికా అన్నారు. శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వీడుకోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో సిబ్బంది తనకు ఎంతో సహకరించారని గుర్తు చేశారు. తను ఎక్కడున్నా కలుపుగొలుపు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని విధుల్లో ఒకరికొకరు తప్పనిసరిగా సహకరించుకోవాలని సూచించారు.బై ది బదిలీపై వెళ్లిన వైద్యాధికారిని అంబికా తో పాటు
సీనియర్ అసిస్టెంట్ విష్ణు,
సూపర్వైజర్ భరత లక్ష్మి, ఏఎన్ఎం అంజమ్మ, లను సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గొల్ల నర్సింలు, వైద్య అధికారి శ్వేత,సి హెచ్ ఓ సిద్దప్ప,హెల్త్ సూపర్వేజర్ ఈశ్వర్ గౌడ్,,సిబ్బంది కమల్, సంగయ్య, సాయిక్రిష్ణ, రవీందర్,మంజుల, సునీత, పద్మ, తదితరులు పాల్గొన్నారు