Wednesday, 4 November 2026

ఆనంద్ పూర్ లో జోరుగా ఇసుక దందా.

 

 

 

 

 

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని అనంద్పూర్ గ్రామంలో జోరుగా ఇసుక దందా జరుగుతుంది. చోట మోట లీడర్లు కలిసి అక్రమ ఇసుక దందాకు తెర లేపుతున్నారు. గ్రామస్తులకు ఎంతో కొంత ముట్ట చెప్పి టెండర్ల ద్వారా ఇస్కా అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు . ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను జిల్లా కేంద్రానికి తరలించే అక్రమంగా సంపాదిస్తున్నారు. రాయల్టీ ల పేరుతో ఏదేచ్ఛగా వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు అటువైపు చూసిన పాపాన పోలేదు. అయితే అధికారులకు సైతం వాటాలు అందుతున్నాయని మండల వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.