మనకొండూరు, ఆర్ సి, ఏప్రిల్ 7 (జనం సాక్షి) ప్రజల మనిషి, అనునిత్యం ప్రజాసేవకై పరితపించే మానకొండూరు ముద్దుబిడ్డ, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గూడూరు వీర రామకృష్ణారావు జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు మానకొండూరు మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు తన అభిమాన నాయకుడు జీవి రామకృష్ణారావు జన్మదిన వేడుక నిర్వహించి, మండల కేంద్రమైన మానకొండూరులో అట్టహసంగా నిర్వహించిన జన్మదిన వేడుకలకు హాజరై జీవి పట్ల తమకున్న ప్రేమ, ఆదరాభిమానాలను చాటుకున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మజ్జిగ వితరణ చేసి పండ్లు, స్వీట్లు ప్రజలకు పంపిణీ చేశారు. మానకొండూరు మండలంలోని వేగురుపల్లి, కొండ పల్కల, ముంజంపల్లి తదితర గ్రామాల్లో జీవి జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మానకొండూరులో జీవి 50వ జన్మదిన వేడుకలకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ హాజరై కేకు కోసి, పార్టీ శ్రేణులతో కలిసి, వేడుకల్లో పాలుపంచుకున్నారు. మానకొండూరు జెడ్పీటీసీ, మానకొండూరు బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మ దిన వేడుకలకు మండల సర్పంచులు,ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు,డైరెక్టర్లు, ఉపసర్పంచ్ లు,రైతు బందు కన్వీనర్లు,సభ్యులు,గ్రామ శాఖ అద్యక్షులు,కార్యవర్గం,మాజీ ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, మండల పార్టీ కార్యవర్గం, మండల గ్రామ అనుబంధ సంఘాల అద్యక్షులు,కార్యవర్గం మండలం లోని అభిమానులు కార్యకర్తలు తదితరులు హాజరై సంబరాలు జరుపుకున్నారు. వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే రసమయి మీడియాతో మాట్లాడుతూ జీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ కాలం నుండి పార్టీకి అండగా, క్రియాశీలకంగా వ్యవహరించిన ఘనత జీవీ రామకృష్ణరావుదేనని అన్నారు. జీవి పై అభిమానంతో హాజరైన పార్టీ శ్రేణుల సంఖ్య చూస్తుంటే ప్రజల మనిషి ప్రజల కోసం పనిచేసే మనిషి పట్ల పార్టీ వర్గాల ఆధారాభిమానాలు తేటతెల్లమవుతున్నాయని స్పష్టం చేశారు. వేడుకలకు హాజరై అభిమానం చాటుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా పార్టీ తరఫున ఎమ్మెల్యే తన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయురారోగ్యాలతో, సంతోషాలతో జీవిత గమనాన్ని కొనసాగించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నామన్నారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రామకృష్ణారావు సేవా నిరతని రసమయి కొనియాడారు. అజాతశత్రువు జీవి పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని రసమయి ఆశాభావం వ్యక్తపరిచారు.మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచ్ నల్ల వంశీధర్ రెడ్డి, రామంచ గోపాల్ రెడ్డి, సాయివేణి రాజు యాదవ్,ఎలగందుల సుదర్శన్, నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, శాతరాజు యాదగిరి,పిట్టల మధు, నెల్లి మురళి, పడాల సతీష్ గౌడ్, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, అడప శ్రీనివాస్,బొల్లం శ్రీనివాస్, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, ఎరవేణి రామాంజనేయులు, బాలంకి మల్లేశం, గడ్డి గణేష్, దండ బోయిన శేఖర్, గుర్రం కిరణ్ గౌడ్, బొంగొని రేణుక తదితరులు జన్మదిన వేడుకలు హాజరై సంబరాల్లో పాలుపంచుకున్నారు.




