ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
మోత్కూరు డిసెంబర్ 10 జనంసాక్షి : ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుంది అని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, మార్కెట్ చైర్మన్ కోనతం యాకుబ్ రెడ్డి లు అన్నారు. తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం మోత్కూర్ మండలం పాలడుగు గ్రామానికి చెందిన కొంపెళ్లి నాగార్జున్ కి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 57 వేల రూపాయల చెక్కును శనివారం వారి ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతు వైద్యం చేయించుకోలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి మండల అధ్యక్షులు కొండ సోంమల్లు, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మర్రిపల్లి చంద్రయ్య,రైతు బంధు అధ్యక్షుడు సింగరెడ్డి నర్సింహారెడ్డి, నాయకులు పులగం వెంకటరెడ్డి, పబ్బు బుచ్చి రాములు,బరిగల నారాయణ, బొడిగే వీరయ్య,పబ్బు హన్మయ్య, రమేష్,కొంపెళ్లి రమేష్,బొడిగే మచ్చగిరి,కొంపెళ్లి కిష్టయ్య,పబ్బు నరేందర్,కొంపెళ్లి మల్లేష్ లు తదితరులు పాల్గొన్నారు.




