Thursday, 5 November 2026

టిప్పర్ ఢీకొని బైక్ మెకానిక్ మృతి

టిప్పర్ ఢీకొని బైక్ మెకానిక్ మృతి.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల్ : డిసెంబర్ 10 ( జనం సాక్షి ) చిన్నంబావి చౌరస్తాలో పెబ్బేరు వైపు వెళ్లే రహదారిలో టిప్పర్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు, మృతుడు ( శ్రీనివాస్ ) సొంత నివాసం అడ్డాకుల మండల్,అడ్డాకుల గ్రామం అయినా శ్రీనివాస్ గత ఐదు సంవత్సరాల నుంచి చిన్నంబాయి చౌరస్తాలో బైక్ మెకానిక్ షెడ్డు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈరోజు శనివారం ఉదయం చిన్నంబా చౌరస్తాలో పెబ్బేరు వైపు వెళ్లే దారిలో టిప్పర్ ఢీకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.