విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలి.
వసతి గృహాలలో పరిశుభ్రతను పాటించండి.
టిఆర్ఎస్వి నియోజకవర్గ ఇన్చార్జ్ జిల్లాని.
తాండూరు డిసెంబర్ 10 (జనం సాక్షి) వసతి గృహం లోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలని టిఆర్ఎస్వి నియోజకవర్గ ఇన్చార్జ్ జిలాని పేర్కొన్నారు. శనివారం తాండూరు పట్టణం లోని ఎస్సీ ,ఎస్టీ ,బిసి బాలికలు మరియు బాలుర కళాశాల, పాఠశాల వసతి గృహాలను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అనునిత్యం కళాశాల పాఠశాల వసతి గృహం వార్డెన్స్ అందుబాటులో ఉండి వారికి సరైన పద్ధతిలో భోజనం అందజేయాలని సూచించారు. అదేవిధంగా వసతిగహంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చూడాలని తెలిపారు.వసతి గృహంలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని ఉన్నత అధికారుల దృష్టికి మరియు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని
పేర్కొన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందజేయాలి




