Thursday, 5 November 2026

ఆపదలో ఆదుకుంటున్న ఆపద్బాంధవుడు..

ఆపదలో ఆదుకుంటున్న ఆపద్బాంధవుడు..
– మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి.
ఊరుకొండ, నవంబర్ 25 (జనంసాక్షి):
ఆపదలో ఉన్న బడుగు బలహీన వర్గాల పేద ప్రజలను ఆదుకుంటున్న ఆపద్బాంధవుడు మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అన్నారు. శుక్రవారం
ఊర్కొండ మండలంలోని గుడిగానిపల్లి గ్రామానికి చెందిన బిజినపల్లి బాలయ్య(50) అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీ ఎన్ ఆర్ యువసేన సభ్యులు మాట్లాడుతూ.. మండలంలో ఎంతమంది నాయకులు ఉన్న తనదైన శైలిలో ప్రజలతో మమేకమైతు ఎక్కడ ఎవరికి ఆపద వచ్చిన నేనున్నానంటూ భరోసానిస్తున్న ఏకైక వ్యక్తి అని ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆపదలలో ఆదుకుంటున్న ఇలాంటి వ్యక్తి డీ ఎన్ ఆర్ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రజలు దీవెనలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డ్ మెంబెర్స్ కవిత రుక్మారెడ్డి, అలివేల, ఇద్దయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్తయ్య, చిదిరే విశ్వనాధం, బీరయ్య, చంద్ర శేఖర్, మాధవ రెడ్డి, దాసరి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.