ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేద్దాం… కార్యకర్తలతో బిజెపి నేత భోస్లే మోహన్ రావు పాటిల్….ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేద్దాం… కార్యకర్తలతో బిజెపి నేత భోస్లే మోహన్ రావు పాటిల్…. జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 25
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు బైంసా వేదికగా ప్రారంభించనున్న ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్రను పెద్ద ఎత్తున జన సమీకరణతో విజయవంతం చేయాలని ముధోల్ నియోజకవర్గ బిజెపి నాయకులు మోహన్ రావు పాటిల్ బైంసా పట్టణ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే సంగ్రామ యాత్ర కొనసాగుతున్నదని మరియు తెరాస ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలి సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని వారు కోరారు. వారి వెంట కౌన్సిలర్లు గాలి రవి దశరథ్ ,అల్లెం దిలీప్ , కపిల్ , మాజీ ఎంపీపీ జాదవ్ సుభాష్ గారు, యువ నాయకులు రామకృష్ణ తదితులున్నారు
ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేద్దాం




