Thursday, 5 November 2026

మధ్యాహ్నం భోజనం పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు

మధ్యాహ్నం భోజనం పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు

ఆత్మకూర్(ఎం) నవంబర్ 25 (జనంసాక్షి) మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మకూర్ ప్రాథమిక పాఠశాల కోరటికల్ ఖప్రాయిపల్లి పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం అమలవుతున్న తీరును కేంద్రం బృందం సభ్యులు పరిశీలించారు నిధులు సకాలంలో అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని ప్రధానోపాధ్యాయులను మరియు ఎస్ఎంసీ చైర్మన్ కమిటి సభ్యులను వంట ఏజెన్సీ వారిని అడిగి తెలుసుకున్నారు అదేవిదంగా వంటకు ఉపయోగించే వస్తువులను పరిశీలించారు విద్యార్థుల వయసును బట్టి బరువు మరియు ఎత్తులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రం బృందం సభ్యులు డాక్టర్ యన్ అర్లప్ప సీనియర్ డిప్యూటి డైరెక్టర్ డాక్టర్
అన్వర్ బాషా సైంటిస్ట్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ మండల విద్యాధికారి బి లక్ష్మినారాయణ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అరవింద రాయుడు బిస్వప్న జిశ్రీను ఎల్డియే యం వెంకటేశ్వర్లు సీఆర్పీ సత్తయ్య నర్సయ్య పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు