ఆపదలో ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది..
– టీపీసీసీ ఉపాధ్యక్షులు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్.
ఊరుకొండ, డిసెంబర్ 16 (జనంసాక్షి):
ఆపదలో ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు. శుక్రవారం ఊర్కొండ మండల పరిధిలోని బొమ్మరాసిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వాటం పెంటయ్య గారు ఇటివల అనారోగ్య సమస్యల కారణంగా హాస్పిటల్లో చేరి రెండు రోజుల క్రితం హాస్పిటల్ నుండి డిషార్జ్ అయ్యారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షులు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ బొమ్మరాసిపల్లి గ్రామానికి వెళ్లి పెంటయ్య గారిని పరామర్శించి అనారోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పెంటయ్య గారిని దైర్యంగా ఉండాలని అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. అదేవిధంగా ఊర్కొండ మండల కేంద్రానికి చెందిన బండి హరీష్(25) శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎర్ర శేఖర్ గారు మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ద్యాప నిఖిల్ రెడ్డి డిఎన్ఆర్ యువసేన పేరిట బాయిత కుటుంబ సభ్యులకు రూ.5వేల ఆర్ధికసాయం కాంగ్రెస్ నాయకుల ద్వారా అందజేశారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరి యోగ క్షేమాలు గురించి ఆలోచించే జడ్చర్ల మాజి ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ గారు నిజమైన ప్రజా నాయకుడని, రాబోయే ఎన్నికల్లో ఎర్ర శేఖర్ గారి నాయకత్వంలో జడ్చర్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, వారి నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని., ఎర్ర శేఖర్ గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి ఊరుకొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ ని తిరుగులేని శక్తిగా మలచడమే లక్షమని తెలిపారు. కార్యక్రమంలో మాధారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి, కాంగ్రెస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు కంఠం విజయుడు, వార్డు సభ్యులు బోయ రవి, మిడ్జిల్ మండల పార్టీ అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి, మున్ననూరు సర్పంచ్ జంగయ్య, నాయకులు దార రాజు, కంఠం యాదయ్య, కంఠం రాములు, రఫిక్, భాస్కర్, అది, సాయిలు, వాడ్యాల విజయ్ కుమార్, యాదయ్య, శ్రీను, రమేష్ తదితరులు ఉన్నారు.
ఆపదలో ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది




