Thursday, 5 November 2026

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేద్దాం నిండు ప్రాణాలను కాపాడుదాం

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేద్దాం నిండు ప్రాణాలను కాపాడుదాం
– జనచైతన్య ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిల్లి శివశంకర్ హుజూర్ నగర్ డిసెంబర్ 15 (జనంసాక్షి): ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేద్దాం నిండు ప్రాణాలను కాపాడుదామని జనచైతన్య ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిల్లి శివశంకర్ అన్నారు. హుజుర్ నగర్ పట్టణంలోనీ ఓ ప్రయివేట్ హిస్పిటల్ నందు గర్భిణీ మహిళకు ఓ పాజిటివ్ రక్తం అవసరం అవ్వడం తో గురువారం వారు జనచైతన్య ట్రస్ట్ సభ్యులు పి.వంశీ, పారా.సాయి, శివశంకర్ లకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి జనచైతన్య ట్రస్ట్ ఉపాధ్యక్షుడు పిల్లి. శివశంకర్ ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్ ఇంజమూరి జయంత్ తో మాట్లాడి హాస్పిటల్ వద్దకు పంపించి రక్తం దానం చేయడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు పిల్లి శివశంకర్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం అనేది చాలా గొప్ప పని అని మనం రక్తాన్ని సృష్టించలేం కానీ దానం మాత్రమే చేయగలం ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండు మూడు సార్లు రక్తదానం చేయొచ్చు అని మీరు చేస్తున్న రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందనీ అన్నారు. రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేద్దాం నిండు ప్రాణాలను కాపాడుదాం అని అన్నారు.