Thursday, 5 November 2026

ఆర్. యూ. పి. పి టీ. ఎస్. సభ్యత్వం

ఆర్. యూ. పి. పి టీ. ఎస్. సభ్యత్వం మెట్ పల్లి, డిసెంబర్ 15 , జనం సాక్షి :
జగిత్యాల జిల్లా లో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ టీ. ఎస్. ఆధ్వర్యంలో భాష పండితుల సభ్యత్వం నమోదు కార్యక్రమం కొనసాగుచున్నది జిల్లా లోని వివిధ పాఠశాలలో జిల్లా పరిషత్ హైస్కూల్ ల లో మెట్ పల్లి , బండ లింగాపూర్ లో సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగినది. 25 సంవత్సరాలు గడిచిన పదోన్నతి లు లేక హైస్కూల్ లలో భాష పండితులు వెట్టి చాకిరీ చేస్తున్నారని భాష పండితులకు స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర తెలుగు మహా సభలో ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ, భాష పండితులకు వ్యతిరేకంగా వున్నా కోర్టు కేసులు వేకెట్ చేయించాలని వెంటనే భాష ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ హోదా పదోన్నతులు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమం లో జగిత్యాల జిల్లా అధ్యక్షులు అల్లకట్టు సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగందుల రాజేంద్ర ప్రసాద్ , భాష పండితులు, స్వామి, ముత్తన్న , రాజేంద్ర ప్రసాద్, కవిత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు