Saturday, 7 November 2026

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేద్దాం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుదాం

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేద్దాం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుదాం
– జనచైతన్య ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి
హుజూర్ నగర్ డిసెంబర్ 27 (జనంసాక్షి): ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేద్దాం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుదామని
జనచైతన్య ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి అన్నారు. మంగళవారం
హుజూర్ నగర్ పట్టణంలోనీ ఒక ప్రయివేట్ హాస్పటల్ లో గర్భిణీ మహిళకు ఓ పాజిటివ్ రక్తం అత్యవసరం కాగా బాధితులు జనచైతన్య ట్రస్ట్ సభ్యులు పి.వంశీ, పారా, సాయి, శివశంకర్ లకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన జనచైతన్య ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్ శీలం నవీన్ తో మాట్లాడి రక్తం అందించడం జరిగిందన్నారు.
ఈ సందర్బంగా ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి మాట్లాడుతూ రక్తదానం అనేది చాలా గొప్ప కార్యక్రమం అని ఎందుకంటే మనం రక్తాన్ని సృష్టించలేం దానం మాత్రమే చేయగలం, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండు, మూడు సార్లు రక్తదానం చేయొచ్చున్నారు. మీరు చేస్తున్న రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందన్నారు.