రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి
హుజూర్ నగర్ డిసెంబర్ 27 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, రైతు సమస్యలపై వహిస్తున్న మొండి వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఇంటి రవి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఆర్డిఓ వెంకా రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన పంట రుణమాఫీ, లక్ష రూపాయల హామీ వెంటనే అమలు చేయాలని, ధరణి పోర్టల్ రద్దు చేయాలి, ఉచిత ఎరువుల హామీని వెంటనే అమలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్రంలో కూడా అమలు చేయాలని, కౌలు రైతుల సమస్యలు పరిష్కరించి వారికి కూడా రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేయాలని, రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కలిగించాలని, వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను రైతులకు సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో మేకల వెంకటేశ్వర్లు, కుందూరు కోటిరెడ్డి, దుండిగాల యల్లయ్య, గుండా గోపి, వల్లపుదాస్ గోపినాథ్, గంథం సతీష్, చింతలపూడి ఉమా మహశ్వరరావు, మంద వెంకటేశ్వర్లు, చిత్తలూరి సోమయ్య, యాల్లావుల సోమరాజు, కుర్ర గోపాల్, పులి నరసింహ, బానోత్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి




