Saturday, 7 November 2026

బిబిస్ శర్మ మృతికి సంతాపం తెలిపిన మున్సిపల్

బిబిస్ శర్మ మృతికి సంతాపం తెలిపిన మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ,మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్
కొండమల్లేపల్లి డిసెంబర్ 27 జనం సాక్షి న్యూస్ :
దేవరకొండ పట్టణం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ బిబిస్ శర్మ ఈరోజు ఉదయం శివకైం చెందారు. ఈ వార్త తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ వారి నివాసంలో పార్థీవదేహానికి పూల మాలవేసి సంతాపం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా బిబిస్ శర్మ దేవరకొండ పురోహితులుగా సమాజానికి చేసిన సేవను కొనియాడారు. దేవాలయానికి వచ్చే భక్తులకు శాంతిని, ప్రశాంతతను బోధిస్తూ అనేక మందిని భక్తి మార్గంలో నడిపించుటకు శర్మ ఎంతో కృషి చేశారని అన్నారు. పవిత్రమైన వారి ఆత్మకు శాంతి కలగాలని, స్వర్గ ప్రాప్తి కలగాలని కోరుకుంటు వారి కుంటుంబానికి సానుభూతిని తెలియజేశారు. వారితో పాటు మార్కెట్ డైరెక్టర్ హాజీ బురాన్, నీల బుచ్చయ్య, కుంచకూరి లక్ష్మణ్, కర్నాటి పురుషోత్తం, కర్నాటి గోవర్ధన్ తదితరులు ఉన్నారు.