Wednesday, 4 November 2026

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేద్దాం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుదాం

హుజూర్ నగర్ మార్చి 4 (జనంసాక్షి): ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేద్దాం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుదాం అని జన చైతన్య ట్రస్టు సభ్యులు కోరారు. హుజుర్ నగర్ పట్టణంలోనీ ఒక ప్రయివేట్ హాస్పటల్ లో ఒక మహిళకు గర్భసంచి ఆపరేషన్ కొరకు ఓ పాజిటివ్ రక్తం అత్యవసరంగా కావాలని నిజాం, జనచైతన్య ట్రస్ట్ సభ్యులు పి.వంశీ, పారా.సాయి, పిల్లి శివశంకర్ లకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి జనచైతన్య ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్ సోమగాని నవీన్ తో మాట్లాడి హాస్పిటల్ వద్దకు పంపించడం జరిగింది. హాస్పిటల్ నుండి డోనర్ సోమగాని నవీన్ కోదాడలోని తిరుమల బ్లడ్ బ్యాంకు వద్దకు వెళ్లి రక్తదానం చేశారు. ఈ సందర్బంగా ట్రస్ట్ అధ్యక్షుడు పారా సాయి మాట్లాడుతూ రక్తదానం అనేది చాలా గొప్ప పని ఎందుకంటే మనం రక్తాన్ని సృష్టించలేం దానం మాత్రమే చేయగలం. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండు మూడు సార్లు రక్తదానం చేయొచ్చు. మీరు చేస్తున్న రక్తదానం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది. రక్తదానం చేసిన సోమగాని నవీన్ కి హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.