Wednesday, 4 November 2026

మోటార్ సైకిల్ ఢీకొని మృతి

గుడిహత్నూర్*మార్చి 4 (జనం సాక్షి)….మోటార్ సైకిల్ ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెదినట్లు ఏఎస్సై జాదవ్ బలిరామ్ తెలిపారు మండలంలో సీతాగొంది గ్రామానికి చెందిన అర్క రాములు(37)అనే వ్యక్తి శుక్రవారం రాత్రి జాతీయ రహదారి దాటుతుండగా ఆదిలాబాద్ నుండి గుడిహత్నూర్ వైపు వస్తున్న మోటార్ సైకిల్ అతన్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు108అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు